ఏపీలో 13 మంది ఐపీఎస్‌ల బ‌దిలీ

13 IPS Transfers in Andhra Pradesh.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం 13 మంది ఐపీఎస్‌ల‌ను బ‌దిలీ చేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 July 2021 7:02 AM GMT
ఏపీలో 13 మంది ఐపీఎస్‌ల బ‌దిలీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం 13 మంది ఐపీఎస్‌ల‌ను బ‌దిలీ చేసింది. రాజ‌మ‌హేంద్ర‌వ‌రం అర్చ‌న్ ఎస్పీగా ఐశ్వ‌ర్య ర‌స్తోగి, జ‌న‌ర‌ల్ అడ్మినిస్ట్రేటివ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీగా డా.షీముషి, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఎస్పీగా రాహుల్ దేవ్ శ‌ర్మ‌, అక్టోప‌స్ ఎస్పీగా డీ.కోయ ప్ర‌వీణ్‌, ఏపీఎస్పీ విజ‌య‌న‌గ‌రం బెటాలియ‌న్ క‌మాండెంట్‌గా విక్రాంత్ పాటిల్‌, మంగ‌ళ‌గిరి డీజీపీ కార్యాల‌యంలో శాంతిభ‌ద్ర‌త‌ల ఏఐజీగా ఆర్ఎన్ అమ్మిరెడ్డి, ప్ర‌కాశం జిల్లా ఎస్పీగా మాలికా గార్డ్‌, విజ‌య‌వాడ రైల్వే ఎస్పీగా రాహుల్ దేవ్ సింగ్‌, కాకినాడ మూడో బెటాలియ‌న్ క‌మాండెంట్‌గా గ‌రుడ్ సుమిత్ సునీల్‌, విశాఖ డీసీపీ-1గా గౌత‌మీ శాలి, ఇంటెలిజెన్స్ ఎస్పీగా వ‌కుల్ జిందాల్‌, మంగ‌ళ‌గిరి ఆరో బెటాలియ‌న్ కమాండెంట్‌గా అజితా వేజెండ్ల‌ను బ‌దిలీ చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. కాగా.. డీజీపీ కార్యాల‌యంలో రిపోర్టు చేయాల‌ని నారాయ‌ణ్ నాయ‌క్‌కు ఆదేశాలు అందాయి.

Next Story
Share it