ఏపీలో గడిచిన 24 గంటల్లో 41,003 కరోనా పరీక్షలు 129 పాజిటివ్ కేసులు నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,87,720కి చేరింది. నిన్న ఒక్క రోజే 147 మంది కోలుకుగా.. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 8,79,278కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,289 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 26 కొత్త కేసులు గుర్తించారు. గుంటూరు జిల్లాలో 17, విశాఖ జిల్లాలో 17 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 1, విజయనగరంలో 1 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,30,95,962 కరోనా శాంపిల్స్‌ను పరీక్షించినట్లు వెల్లడించారు.