ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 42,809 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 125 పాజిటివ్ కేసులు నిర్థార‌ణ అయిన‌ట్లు రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ తాజా బులెటిన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 8,87,591కి చేరింది. నిన్న ఒక్క రోజే 175 కోలుకుగా.. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 8,79,131కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 1,308 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 26 కొత్త కేసులు గుర్తించారు. గుంటూరు జిల్లాలో 19, విశాఖ జిల్లాలో 19 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 1, కడప జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 2 కేసులు వెల్లడయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 1,30,54,959 క‌రోనా శాంపిల్స్‌ను ప‌రీక్షించిన‌ట్లు వెల్ల‌డించారు.

తోట‌ వంశీ కుమార్‌

Next Story