ఏపీ క‌రోనా బులిటెన్‌.. పెరిగిన కేసులు

1248 New corona cases reported in ap.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌టితో పోలిస్తే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Aug 2021 6:01 PM IST
ఏపీ క‌రోనా బులిటెన్‌.. పెరిగిన కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వ‌ల్పంగా పెరిగింది. గ‌డిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 58,890 సాంపిల్స్ పరీక్షించగా 1,248 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగ‌ళ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 20,04,590 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. కొవిడ్ వ‌ల్ల 15 మంది ప్రాణాలు కోల్పోయారు. క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టికి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,750కి చేరింది.

కొత్త‌గా 1715 మంది బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,77,163కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 13,677 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నేటి వరకు రాష్ట్రంలో 2,61,98,824 సాంపిల్స్ ప‌రీక్షించారు.

Next Story