ఏపీలో కరోనా కేసులు భారీగా పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో 30,993 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 121 కొత్త కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 8,82,142కి చేరింది. తాజాగా 289 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,72,561కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,450 యాక్టివ్ కేసులున్నాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 24 కేసులు రాగా, చిత్తూరు జిల్లాలో 23, విశాఖపట్నం జిల్లాలో 13, గుంటూరు జిల్లాలో 12 కేసులు గుర్తించారు. విజయనగరం జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా రాలేదు. శ్రీకాకుళం జిల్లాలో 2, ప్రకాశం జిల్లాలో 5, పశ్చిమ గోదావరి జిల్లాలో 5, కర్నూలు జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో ఇద్దరు మరణించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,131 కి చేరింది. నేటి వరకు రాష్ట్రంలో 1,23,55,607 శాంపిల్స్ ను పరీక్షించారు.