ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 48,973 కరోనా పరీక్షలు నిర్వహించగా 120 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,91,004కి చేరింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 35 మందికి కరోనా సోకినట్టు వెల్లడైంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 93 మంది కరోనా నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నా వారి సంఖ్య 8,82,763కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,064 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 7,177కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,43,56,138 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో వెల్లడించింది.