ఏపీలో తీవ్ర‌రూపం దాల్చుతున్న క‌రోనా.. కొత్త‌గా ఎన్నికేసులంటే..?

1184 New corona cases in ap.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 30,964 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 1,184 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 March 2021 12:10 PM GMT
AP corona update

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి అంత‌కంత‌కూ పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 30,964 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 1,184 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,01,989కి చేరింది. అత్య‌ధికంగా గుంటూరు జిల్లాలో 352 కేసులు న‌మోదు కాగా.. అత్య‌ల్పంగా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో 19 కేసులు న‌మోదు అయ్యాయి. నిన్న ఒక్క రోజు న‌లుగురు క‌రోనా కార‌ణంగా మృత్యువాత ప‌డ్డారు. దీంతో ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,217కి చేరింది.

ఒక్క రోజు వ్య‌వ‌ధిలో 456 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 8,87,434కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 7,338 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 1,50,83,179 న‌మూనాల‌ను ప‌రీక్షించిన‌ట్లు వైద్య, ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన బులెటిన్‌లో వెల్ల‌డించింది.


Next Story
Share it