ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 45,079 కరోనా పరీక్షలు నిర్వహించగా 118 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,90,884కి చేరింది.అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 38 మందికి కరోనా సోకినట్టు వెల్లడైంది. కృష్ణా జిల్లాలో 21, విశాఖ జిల్లాలో 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 89 మంది కరోనా నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నా వారి సంఖ్య 8,82,670కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,038 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఒక్కరు కూడా మృతి చెందలేదు. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 7,176 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,43,07,165 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్లో వెల్లడించింది.