ఏపీ కరోనా అప్ డేట్.. కొత్తగా ఎన్నికేసులంటే..?
118 New corona cases in AP.ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 37,041
By తోట వంశీ కుమార్ Published on 27 Feb 2021 12:37 PM GMT
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 37,041 కరోనా పరీక్షలు నిర్వహించగా 118 పాజిటివ్ కేసులు నిర్థరాణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,89,799కి చేరింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 33 కేసులు నమోదు కాగా, విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 86 మంది కరోనా నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నా వారి సంఖ్య 8,81,963కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 7,169. కాగా.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,39,15,009 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో వెల్లడించింది.
#COVIDUpdates: 27/02/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) February 27, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,86,904 పాజిటివ్ కేసు లకు గాను
*8,79,068 మంది డిశ్చార్జ్ కాగా
*7,169 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 667#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/M4oN6MQDvl