ఏపీలో తగ్గిన కరోనా కేసులు
111 New corona cases in AP.ఏపీలో కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 33,808 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 111 పాజిటివ్ కేసులు
By తోట వంశీ కుమార్ Published on
27 Jan 2021 12:47 PM GMT

ఏపీలో కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 33,808 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 111 పాజిటివ్ కేసులు నమోదుఅయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 8,87,349కి చేరింది. నిన్న ఒక్కరోజే 97 మంది కోలుకుగా.. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 8,78,828కి చేరింది. ప్రస్తుతం 1369 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,152కి చేరింది.
అత్యధికంగా కృష్ణా జిల్లాలో 19 కేసులు రాగా, చిత్తూరు జిల్లాలో 16, పశ్చిమ గోదావరి జిల్లాలో 14 కేసులు గుర్తించారు. ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఈరోజు వరకు రాష్ట్రంలో 1,29,75,961 కరోనా శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.
Next Story