నిన్న‌టితో పోలిస్తే క‌రోనా కేసులు కొంచెం త‌గ్గుముఖం ప‌ట్టాయి. గడిచిన 24 గంట‌ల్లో 45,077 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 102 పాజిటివ్ కేసులు నిర్ధార‌ణ అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 8,90,317కి చేరింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 25 పాజిటివ్ కేసులు నమోదు కాగా, విశాఖ జిల్లాలో 22 కేసులు వెల్లడయ్యాయి. విజయనగరం జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 56 మంది కరోనా నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకున్నా వారి సంఖ్య 8,90,317కి చేరింది. గ‌డిచిన 24 గంట‌ల్లో ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,171కి చేరింది. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 1,40,92,251 న‌మూనాల‌ను ప‌రీక్షించిన‌ట్లు ప్ర‌భుత్వం బులెటిన్‌లో వెల్ల‌డించింది.తోట‌ వంశీ కుమార్‌

Next Story