ఏపీలో క‌రోనా విజృంభ‌ణ‌.. వెయ్యిదాటిన క‌రోనా కేసులు

1005 New corona cases in AP.ఆంధ్ర‌ప్రదేశ్‌లో 31,142 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 1,005 పాజిటివ్ కేసులు నిర్థార‌ణ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 March 2021 1:01 PM GMT
1005 New corona cases in AP

ఆంధ్ర‌ప్రదేశ్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 31,142 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 1,005 పాజిటివ్ కేసులు నిర్థార‌ణ అయిన‌ట్లు వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన బులెటిన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుమ సంఖ్య 8,98,815కి చేరింది. అత్య‌ధికంగా గుంటూరులో 225 కేసులు న‌మోదు కాగా.. అత్య‌ల్పంగా విజ‌య‌న‌గ‌రంలో 13 కేసులు న‌మోదు అయ్యాయి.

నిన్న ఒక్క రోజే 324 మంది క‌రోనా నుంచి కోలుకుగా.. మొత్తంగా 8,86,216కి కోలుకున్నారు. క‌రోనా వ‌ల్ల చిత్తూరు, కృష్ణ జిల్లాలో ఒక్కొక్క‌రు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,205కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 5,394 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 1,49,90,039 శాంపిల్స్‌ని ప‌రీక్షించారు.
Next Story
Share it