ఏపీ ప్రభుత్వ మహిళలకు శుభవార్త చెప్పింది. ఏపీలో మహిళలు, చిన్నారుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే సోమవారం మొబైల్ ఫోన్ కొనుగోలు చేసిన వారికి 10 శాతం రాయితీ పొందండి. ఎంపిక చేసిన మొబైల్ షాపుల్లో మాత్రమే. ఇదేదో మొబైల్ షోరూమ్‌లో కాదు.. ప్రభుత్వం ఇచ్చిన బంపర్ ఆఫర్. జాతీయ మహిళా దినోత్సం పురస్కరించుకుని ముఖ్యమంత్రి జగన్ మహిళలకు ఈ కానుకను ప్రకటించారు. మార్చి 8వ తేదీ సోమవారం మొబైల్ ఫోన్ కొని దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే వారికి మాత్రమే ఈ 10 శాతం రాయితీ వర్తిస్తుందని అన్నారు.
ఏపీలో మహిళలకు ఆర్థిక, రాజకీయ స్వాలంబన కల్పించేలా అడుగులు వేస్తోంది. మహిళల కోసం ఇప్పటికే అమ్మ బడి, చేయూత తదితర పథకాలు ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం.. మరో కొత్త స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు. హోంశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పదవుల్లో మహిళలకు అవకాశం కల్పించారు. మహిళల రక్షణ, భద్రత విషయంలో ఏ మాత్రం రాజీపడటం లేదు. మహిళల భద్రత కోసమే దిశ చట్టాన్ని తీసుకువచ్చింది జగన్ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా దిశ పోలీసుస్టేషన్‌లను సైతం అందుబాటుకి తీసుకువచ్చింది.
ఇప్పటి వరరకు రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. యాప్‌ను ఉపయోగించి రిపోర్టు చేసిన 799 ఘటనల్లో చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి 154 ఎఫ్‌ఐఆర్‌లు రిజిస్టర్ చేశామని వెల్లడించారు. అలాగే మహిళలు, బాలలపై నేరాలకు సంబంధించి 7 రోజుల్లోగా ఛార్జిషీటు దాఖలు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అందుకు తగ్గట్లు వ్యవస్థను తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.