షార్ట్‌ సర్క్యూట్‌తో బస్సు దగ్ధం.. బస్సులో 20 మంది..!

By అంజి  Published on  27 Nov 2019 5:29 AM GMT
షార్ట్‌ సర్క్యూట్‌తో బస్సు దగ్ధం.. బస్సులో 20 మంది..!

ప్రకాశం జిల్లాలో ఓ ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన పామురు మండలం లింగారెడ్డిపల్లె వద్ద చోటు చేసుకుంది. పామురి నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కావేరి ట్రావెల్‌ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటను బస్సును ఆపిన డ్రైవర్‌.. ప్రయాణికులను బస్సు నుంచి దింపారు. డ్రైవర్‌ సమయ స్ఫూర్తితో తృటిలో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.

Next Story
Share it