ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ముగిసింది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 2023 - 24 సాధారణ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 2023–24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రిమండలి ఆమోదించింది. బడ్జెట్‌తో పాటు ఉప లోకాయుక్త నియామకంలో మార్పులకు సంబంధించిన డ్రాప్ట్ బిల్లుకు ఆమోదం తెలిపింది.
మరికాసేపట్లో అసెంబ్లీలో 2023- 24 వార్షిక బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. రూ.2.79లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. వ్యవసాయ బడ్జెట్‌ను నున్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజలు, బలహీన వర్గాలకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. పరిపాలనా పరమైన మార్పులు చేసిన వాటికి కేటాయింపులు చేసినట్లు తెలిపారు. పథకాలను బలోపేతం చేసి మరింత మందికి అవకాశం ఇచ్చేలా కేటాయింపులు జరిపామన్నారు.