కొత్తగా 21 పాజిటివ్‌ కేసులు.. ఏపీ ఆరోగ్యశాఖ

By సుభాష్  Published on  11 April 2020 11:19 AM GMT
కొత్తగా 21 పాజిటివ్‌ కేసులు.. ఏపీ ఆరోగ్యశాఖ

ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఏపీలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. శనివారం 4 గంటలకు తాజా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది ఏపీ ఆరోగ్యశాఖ. కొత్తగా 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలిపింది. ఇప్పటి వరకూ 402 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలిపింది. శనివారం గుంటూరులో -14, కర్నూలు -5, ప్రకాశం -1, కడపలో -1 పాజిటివ్‌ కేసు చొప్పున నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 909 పరీక్షల్లో 37 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకూ ఆరుగురు మృతి చెందారు.

కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించింది ఏపీ సర్కార్‌. దీంతో ప్రజలెవ్వరిని బయటకు రానివ్వకుండా చర్యలు చేపడుతున్నారు పోలీసులు. నిత్యావసరాలను సైతం వారి వద్దకే సరఫరా చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు చేపడుతున్నారు.

Next Story