కేంద్రం హెల్త్‌ బులిటెన్‌: గడిచిన 24 గంటల్లో కొత్తగా 1035 కరోనా కేసులు

By సుభాష్  Published on  11 April 2020 10:52 AM GMT
కేంద్రం హెల్త్‌ బులిటెన్‌: గడిచిన 24 గంటల్లో కొత్తగా 1035 కరోనా కేసులు

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. చాపకింద నీరులా వ్యాపిస్తున్న ఈ వైరస్‌ అన్ని రాష్ట్రాల్లో వ్యాపించింది. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. మోదీ పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఇక లాక్ డౌన్ ఏప్రిల్‌ 14తో ముగుస్తుందనుకునేలోపే మర్కాజ్‌ ఉదాంతం తర్వాత కేసుల సంఖ్య, మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి.

ఈ సందర్భంగా శనివారం 4 గంటలకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ను విడుద చేసింది. గడిచిన 24 గంటల్లో 1035 కొత్తగా కరోనా కేసులు నమోదైనట్లు వెల్లడించింది. ఇప్పటి వరకూ దేశంలో 7,447 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకూ 239 మంది మృతి చెందినట్లు కేంద్రం తెలిపింది. గడిచిన 24 గంటల్లో 40 మంది మృతి చెందారు.

దేశ వ్యాప్తంగా 586 కరోనా ఆస్ప్తత్రులు, 67 ప్రైవేటు, 146 ప్రభుత్వ పరీక్ష ల్యాబ్‌లు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో లక్ష ఐసోలేషన్‌ బెడ్లను సిద్ధం చేసినట్లు పేర్కొంది. వైరస్‌ను అరికట్టేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోందని తెలిపింది.

Next Story