సుధీర్ రొమాన్స్ చూసి నాకే మ‌తిపోయింది..

By అంజి  Published on  8 Feb 2020 2:56 AM GMT
సుధీర్ రొమాన్స్ చూసి నాకే మ‌తిపోయింది..

సుధీర్ న‌టించిన త్రీ మంకీస్ సినిమా శుక్ర‌వారం నాడు అన్ని థియేట‌ర్‌ల‌లో రిలీజై స‌క్సెస్ ఫుల్‌గా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. అన్ని చోట్లా పాజిటివ్ టాక్‌ను సంపాదించుకున్న అభిమానులు, బుల్లితెర న‌టులు వారి వారి అభిప్రాయాల‌ను తెలియ‌జేస్తున్నారు. వారిలో ముఖ్యంగా సుడిగాలి సుధీర్ క్ర‌ష్ ర‌ష్మీ కూడా త్రీ మంకీస్ సినిమాపై స్పందించింది.

సుధీర్ సినిమాను మొద‌టి రోజే చూసిన ర‌ష్మీ సినిమాపై త‌న అభిప్రాయాన్ని తెలిపింది. సుధీర్ మ‌ల్టీ టాలెంటెడ్ అని మ‌రోసారి నిరూపించాడు. ఇప్ప‌టికే సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ త్రీ మంకీస్ మూవీతో మ‌రో మెట్టు ఎదిగాడంటూ సుధీర్‌ని ఆకాశానికి ఎత్తేసింది ర‌ష్మీ.

మా జ‌బ‌ర్ద‌స్త్ మూడు కోతులు వెండి తెర‌పై పిచ్చ కామెడీ చేశారు. వారి టాలెంట్‌ను మ‌రోసారి నిరూపించారంటూ సుధీర్‌, రామ్ ప్ర‌సాద్‌, శ్రీ‌నుల‌ను ర‌ష్మీ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తింది. ముఖ్యంగా ఈ మూవీలో హీరోయిన్‌తో సుధీర్ చేసిన రొమాన్స్ గురించి ర‌ష్మీ ప్ర‌త్యేకంగా చెప్పుకొచ్చింది. త్రీ మంకీస్ హీరోయిన్‌తో సుధీర్ చేసిన రొమాంటిక్ కామెడీ సూప‌ర్ అంటూ ర‌ష్మీ తెలియ‌జేసింది.

మేమిద్ద‌రం ఎన్నో షోలు, ఈవెంట్‌లు చేశాం. మా ఇద్ద‌రి మ‌ధ్య ఎంతో కెమెస్ట్రీ ఉంద‌ని అంద‌రూ భావిస్తారు. కానీ, సుధీర్ ఈ సినిమాలో చేసిన రొమాన్స్ చూస్తే నాకే మ‌తిపోయింది. ఈ సినిమాలో నా బేబీ చాలా హాట్ అంటూ సుధీర్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఈ సినిమాలో ఎంత కామెడీ ఉందో అంతే లెవ‌ల్లో ఎమోష‌న‌ల్ సీన్స్ కూడా ఉన్నాయి.

మ‌రీ ముఖ్యంగా సెకండాఫ్ ఫుల్ లెంగ్త్ కామెడీగా సాగింది. ప్ర‌తీ ఒక్క సీన్‌లో సుధీర్ చేసిన కామెడీ రొమాన్స్ ఈ సినిమాలో మ‌రింత హైలెట్‌గా నిలిచింద‌ని అభిమానులు కూడా చెబుతున్నారంటూ ర‌ష్మీ పేర్కొంది. మొత్తానికి అటు సుధీర్ అభిమానులు, ఇటు ర‌ష్మీ అంద‌రూ ఈ సినిమాపై మంచి స్పంద‌న తెలియ‌జేస్తున్నారు. ఇక‌పోతే ఇప్ప‌టికే ఈ సినిమాపై ఉన్న అంచనాల‌ను సుధీర్ టీమ్ అందుకుంది. ర‌ష్మీతోపాటు ఢీ, జ‌బ‌ర్ద‌స్త్ స‌భ్యులు కూడా ఈ సినిమాపై ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. అతి త్వ‌ర‌లో సుధీర్, ర‌ష్మీ జంట‌గా ఒక సినిమా మొద‌లు కాబోతుంద‌న్న‌ది టాలీవుడ్ టాక్. దీంతో వారి అభిమానుల‌కు ఫుల్ మీల్స్ ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

Next Story
Share it