కాలేజీల్లో జరుగుతున్నదే చూపించాం.. డిగ్రీ కాలేజ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..!
By అంజి Published on 8 Feb 2020 4:30 AM GMT
ఒకప్పుడు తన చిత్రాలతో నేషనల్ అవార్డు తెచ్చుకున్న డైరెక్టర్ అతను. కానీ, ఇప్పుడు తీసిన సినిమాతో మాత్రం విమర్శలు ఎదుర్కొంటున్నారు. దేవాలయాల్లాంటి విద్యా సంస్థల్లో అటువంటి పనులు జరుగుతున్నట్టు చూపించడానికి మనసెలా వచ్చిందంటూ సినీ జనాలు గట్టిగా నిలదీస్తున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు..? ఆ మూవీ గోలేంటి..? అన్న విషయానికొస్తే..
నరసింహా నంది డైరెక్ట్ చేసిన డిగ్రీ కాలేజ్ మూవీ శుక్రవారం విడుదలైంది. ఇప్పుడు ఆ మూవీనే కాంట్రవర్సిల్లో చిక్కుకుంది. విద్యా సంస్థల్లో హీరో హీరోయిన్ల మధ్య శృంగార సన్నివేశాలను ఎలా చూపిస్తారంటూ సినీ జనాలు మేకర్స్ మీద ఫైరవుతున్నారు. అమ్మాయిని బైక్ మీద కూర్చోబెట్టుకుని, వెనుక పరుపు కట్టుకుని మొక్క జొన్న తోటలోకి వెళ్తున్న షాట్స్ మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, కాలేజీ ప్రేమల ముసుగులో కులం, మతం, ప్రాంతాల మధ్య చిచ్చురేపుతారా..? సినిమాను చూసిన సాటి ప్రేక్షకులు విమర్శలు చేస్తున్నారు. వరుణ్, దివ్యారావు జంటగా నరసింహానంది స్వీయ దర్శకత్వంలో డిగ్రీ కాలేజ్ మూవీని తెరకెక్కించారు. గతంలో 1940 లవ్ స్టోరీ చిత్రంతో నేషనల్ అవార్డు అందుకున్న నరసింహా నంది తాజాగా, థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ వల్ల తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు.
ఇదే విషయమై నరసింహా నంది మీడియాతో మాట్లాడుతూ ఒక అమ్మాయి.. ఒక అబ్బాయి వారి నిజ జీవితాల్లో ఏదైతే జరిగిందో దాన్నే మూవీలో చూపించామన్నారు. వారి నిజ జీవితాల్లో జరిగిన సంఘటనలను విన్నపుడు తాను షాక్‌కు గురయ్యానని, ఎటువంటి ఉద్వేగానికి గురయ్యానో ఆ అనుభూతులన్నింటిని ఆడియన్స్‌తో పంచుకుందామన్న ఉద్దేశంతో డిగ్రీ కాలేజ్ మూవీని తెరకెక్కించడం జరిగిందని క్లారిటీ ఇచ్చారు.