బ‌కాయి ప‌డ్డ‌ స‌ర్వీస్ టాక్స్ క‌ట్టిన అన‌సూయ‌..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Dec 2019 1:37 PM GMT
బ‌కాయి ప‌డ్డ‌ స‌ర్వీస్ టాక్స్ క‌ట్టిన అన‌సూయ‌..!

హైదరాబాద్: టాలీవుడ్ న‌టి, జ‌బ‌ర్థ‌స్త్ కామెడి షో యాంక‌ర్ అన‌సూయ భ‌ర‌ద్వాజ్ ఇంటిపై కొద్దిరోజుల క్రితం జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఆధ్వ‌ర్యంలో హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ అధికారులు ఇన్స్‌పెక్ష‌న్స్‌ నిర్వ‌హించార‌నే వార్త‌లు వెలువ‌డ్డాయి. ఈ ఇన్స్‌పెక్ష‌న్స్‌ లో బ‌కాయి ప‌డ్డ రూ. 80 లక్షలు(వ‌డ్డీతో స‌హా) ఉండ‌గా రూ. 25 ల‌క్ష‌లు ప‌న్ను చ‌ల్లించిన‌ట్లు ఈ వార్త‌ల్లోని స‌మాచారం.

వివ‌రాళ్లోకెళితే.. 2019 ఏప్రిల్‌లో అన‌సూయ ఇంటికి జీఎస్‌టీ అధికారులు వెళ్లారు. అప్పుడు 2014కు సంబందించి ఆమె ప్ర‌ద‌ర్శ‌న‌ల తాలుకు కొన్ని కీల‌క‌ప‌త్రాల‌ను సేక‌రించారు. అదే విష‌య‌మై అన‌సూయ‌ కొన్ని వారాల క్రితం.. 2014 కి సంబంధించి స‌ర్వీసు టాక్స్‌ను చెల్లించింది. అంతేకానీ ఇటీవ‌ల ఆమె ఇంటిలో ఎటువంటి సోదాలు జ‌రుగ‌లేదు.

అయితే.. అనసూయ మాత్రం తన ఇంట్లో సోదాలు జరిగాయంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేసింది. ఈ మేరకు ఆమె ట్విట్ చేసింది. ‘బంజారాహిల్స్‌లోని నా ఇంట్లో సోదాలు జరిగాయంటూ వార్తలు వస్తున్నాయి. అది నిజం కాదని పేర్కొంది. మీడియా ఉండేది సరైన సమాచారాన్ని ప్రజలకు అందచేయడానికే తప్ప తమ వ్యక్తిగత అభిప్రాయాలను అందించడానికి కాదని ఫైర్ అయ్యింది. ఈ రంగంలో ఉన్న మేము ఈ స్థాయికి రావ‌డానికి ఎన్నో త్యాగాలు చేశామ‌ని.. మీడియా అనేది సమాజానికి మంచి చేయడానికి పనిచేయాలి కానీ.. ఎవ‌రి జీవితానికి, గౌరవానికి భంగం కలిగించకూడదని లేఖ‌లో పేర్కొంది. సరైన సమాచారంతోనే వార్తలు రాయాలని మీడియా వారికి విజ్ఞప్తి చేస్తున్నాని ట్విట్ట‌ర్‌లో పేర్కొంది.

ఇదిలావుంటే.. జ‌బ‌ర్థ‌స్త్ కామెడీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న‌ అన‌సూయ భ‌ర‌ద్వాజ్.. అడ‌పాద‌డ‌పా ఐటం సాంగులలో త‌ళుక్కుమంటుంది. అంతేకాక ఆమె సోగ్గాడే చిన్నినాయ‌న‌, క్ష‌ణం, క‌థ‌నం, మీకు మాత్ర‌మే చెప్తా, ఎఫ్-2, రంగ‌స్థ‌లం, యాత్ర‌, గాయ‌త్రి, విన్న‌ర్ వంటి ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌లో న‌టించింది.Next Story
Share it