నీళ్లనుకొని శానిటైజర్ తాగిన అధికారి
By రాణి
మంచినీళ్లకొని శానిటైజర్ తాగిన ఓ అధికారి ఇప్పుడు ఆస్పత్రి పాలయ్యారు. శుక్రవారం ఉదయం అనంతపురం డీఎంహెచ్ఓ అనిల్ కుమార్ ఇంట్లో.. దాహంగా ఉందని పక్కనే ఉన్న శానిటైజర్ బాటిల్ ను ఎత్తి గడగడ రెండు గుటకలేశారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా ప్రాణాపాయమేమీ లేదని తెలిపారు. డీఎంహెచ్ఓ ను పరామర్శించేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు ఆస్పత్రికి చేరుకున్నారు.
Also Read : ఫోర్బ్స్ లిస్ట్ లో ప్రపంచ కుబేరుడిగా జెఫ్ బెజోస్
కాగా..చిన్న పిల్లలకు శానిటైజర్లను దూరంగా ఉంచాలని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా చేతులకు శానిటైజర్ పూసుకుని గ్యాస్, కొవ్వొత్తి, దీపారాధనలు చేయవద్దని కూడా సూచనలు జారీ చేశారు. ఏపీలో ఇప్పటి వరకూ 365 కరోనా కేసులు నమోదవ్వగా ఆరుగురు మృతి చెందారు. తెలంగాణలో 471 కరోనా కేసులను గుర్తించగా 45 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 12కి చేరింది.