బెజ్జూర్ అడవికి అరుదైన రష్యన్ పక్షులు ఎందుకొస్తున్నాయి?

By అంజి  Published on  9 Dec 2019 5:34 AM GMT
బెజ్జూర్ అడవికి అరుదైన రష్యన్ పక్షులు ఎందుకొస్తున్నాయి?

ఏ దేశానికి చెందినవో... అవి ఎక్కడికి వెళ్లాలో తెలియదు కానీ రెండు ఫాల్కన్ పక్షులు మాత్రం కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లానే తల ఇల్లుగా చేసుకున్నాయి. అముర్ ఫాల్కన్ పక్షులుగా పేరొందిన ఈ రెండు పక్షులు జిల్లాలోని బెజ్జూర్ అడవుల్లో ఇప్పుడు నివాసం ఏర్పాటుచేసుకున్నాయి. పక్షి ప్రేమికులు, పర్యావరణ ప్రేమికులు ఇప్పుడు ఈ పక్షుల జంటను చూసేందుకు అడవుల్లో వెతుకుతున్నారు నిజానికి ఈ పక్షులు చల్లగా ఉండే ప్రాంతానికి వెళ్తూంటాయి. మామూలుగా నాగాలాండ్ కి, దక్షిణాఫ్రికాకి వెళ్లవలసిన ఈ పక్షులు బెజ్జూర్ కి రావడం, ఇక్కడ ఉండిపోవడం ఆనందకరమని జిల్లా అటవీ శాఖాధికారులు అంటున్నారు. నిజానికి ఈ పక్షులు రష్యా, చైనాలో గుడ్లు పెట్టి, ఆ తరువాత దక్షిణాఫ్రికాకి వెళ్తాయి.

కొన్నాళ్ల క్రితం వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ రాజేశ్ కన్ని ఈ పక్షులను గుర్తించాడు. ఆయన మూడు నెలల వ్యవధిలో రెండు సార్లు వాటిని గమనించి, ఫోటోలు తీశారు. బెజ్జూరు అటవీ ప్రాంతంలో చెరువులు, కుంటలు, పచ్చదనం పుష్కలంగా ఉన్నాయి. దాంతో ఈ పక్షులు ఈ ప్రాంతంలో గూళ్లు కట్టుకోవడం మొదలు పెట్టాయి. ఇలా వేరే చోటకి వెళ్లాల్సిన వలస పక్షులు బెజ్జూరుకు రావడం ఇదే మొదటి సారి కాదు, హిమాలయన్ గ్రిఫాన్స్ వంటి పక్షులు నందిగావ్ గ్రామం వద్ద ఉన్న పాలారపు కోనలో కనిపించాయి. ఈ ప్రాంతంలో ఇతర గద్ద జాతి పక్షులు ఉంటాయి. ఇవి అరుదైన పక్షి జాతికి చెందినవి.

Next Story