మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన భార్య అమృతా ఫడ్నవీస్‌ మంగళవారం రాత్రి సంచలన ట్వీట్ చేశారు. ఓ ఉర్దూ కవితను జోడిస్తూ ఈ ట్విట్‌ చేశారు. అదేంటంటే… ‘సీజన్ కొంచెం మారనివ్వండి, తిరిగి పరిమళాలతో తాము తిరిగి వస్తాం’ అంటూ ట్విట్‌ లో వ్యాఖ్యానించారు. గడచిన ఐదేళ్ల పాటు ఎన్నో మధుర జ్ఞాపకాలు అందించారని మహారాష్ట్ర ప్రజలనుద్ధేశించి ట్విట్‌ చేశారు. మీ ప్రేమను తామెప్పుడూ మరవలేమని, ఎప్పుడూ గుర్తుంచుకుంటాం అని అని అమృతా ఫడణవీస్ పేర్కొన్నారు.

పలాట్ మి ఆయింగే షాఖోన్ పే ఖుష్బూ లేకర్, ఖిజా కి జాద్ మైనే హూన్, మౌసం జరా బదల్ నే దే (సీజన్ కొంచెం మారేంత వరకు వేచి చూసి, త్వరలోనే తిరిగి వచ్చి కొమ్మలపై పరిమళాలను వెదజల్లుతాం… అని ఉర్దూ ద్విపదను ఉటంకిస్తూ దేవేంద్ర ఫడణవీస్ భార్య అమృతా ట్వీట్ చేశారు.ప్రజలకు తన సాధ్యమైనంత మేర సానుకూల మార్పు దిశగా పనిచేసేందుకు తాను ప్రయత్నించానని చెప్పుకొచ్చారు ఆమె. కాగా, బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా బలపరీక్ష ఎదుర్కొవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన క్రమంలో 80 గంటల పాటు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్‌ తన పదవికి రాజీనామా చేయడంతో మహారాష్ట్రలో ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుతీరేందుకు మార్గం సుగమమైంది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.