భర్తపై పీకల్లోతు కోపం..బచ్చన్ పై 'అమిత'మైన ప్రేమ
By రాణి Published on 25 April 2020 8:10 AM GMTబాలీవుడ్ బాద్ షా అమితాబ్ బచ్చన్ - జయా బచ్చన్ లది ప్రేమ వివాహం అనుకుంటుంటారు చాలా మంది. కానీ నిజానికి అమితాబ్ మనస్ఫూర్తిగా ప్రేమించింది రేఖ ని. దశాబ్దాలుగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగింది. కానీ ఊహించని హఠాత్ పరిణామాలతో బిగ్ బి జయబాధురిని పెళ్లాడటంతో రేఖ - అమితాబ్ ల ప్రేమకు బ్రేక్ పడిందది. అప్పటి నుంచి వీరిద్దరూ దూరమయ్యారు కానీ ఇప్పటికీ కూడా అమితాబ్ అంటే తనకెంతో ప్రేమ ఉందని బహిరంగంగానే వెల్లడించారు రేఖ.
Also Read : పిచ్చివాగుడు వాగితే తాట తీస్తా..మాధవీ లత కు శ్రీరెడ్డి వార్నింగ్
ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేఖ తన జీవితంలోని కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చారు. అమితాబ్ తో బ్రేకప్ తర్వాత రేఖ వివాదాస్పద విలన్ గా పేరొందిన పునీత్ ఇస్సార్ ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కూలీ సినిమా షూటింగ్ లో అమితాబ్ కు పెద్ద ప్రమాదం జరిగి దాదాపు మరణం అంచుల వరకూ వెళ్లొచ్చారు. అప్పట్నుంచి తనకు భర్త మీద పీకల్లోతు కోపం ఏర్పడిందని చెప్పారు రేఖ. ఆ సంఘటన తర్వాత ఎప్పుడు భర్త ఎదురుపడినా రేఖ కనీసం కన్నెత్తైనా చూసేవారు కాదట. ఈ ఘటన కేవలం రేఖకే కాదు..చాలా మందికి నచ్చలేదు. రేఖ, బిగ్ బి ల పై కోపం తోనే పునీత్ కావాలని ప్రమాదం జరిగేలా చేశాడన్న ఆరోపణలొచ్చాయి. దీంతో ఆరేళ్లపాటు ఆయన సినిమాలకు దూరమయ్యారు. దాదాపు సినిమా కెరీర్ ముగిసిపోతుందనుకుంటున్న సయంలో మహాభారత్ లో దుర్యోధనుడిగా పాత్ర వచ్చింది. అప్పటి నుంచి కాస్త సినిమాల్లో అవకాశాలు మొదలయ్యాయని చెప్పారు రేఖ.
Also Read : కిడ్నాప్ చేసి.. నిర్బంధించి.. 13 రోజులుగా అదే పని
షూటింగ్ సమయంలో గాయపడిన అమితాబ్ గాయపడ్డాక ఒకానొక సందర్భంలో తన భర్తను అమితాబ్ కలిశారని, ప్రమాదం జరగడానికి పునీత్ కు ఎలాంటి సంబంధం లేదని చెప్పడంతో కాస్త ఊరట పొందానని చెప్పారు రేఖ. అమితాబ్ కు గాయమైనప్పుడు తాను రక్తదానం కూడా చేశానన్నారు. ఆ తర్వాత కొంతకాలానికే తన భర్త చనిపోయినా రేఖ ఇంకా ముత్తైదువుగానే ఉన్నారు. దీనిపై చాలా మంది ప్రశ్నించినా ఆమె స్పందించలేదు. ఇప్పుడు దానిపై వివరణ ఇచ్చారు. భర్త పునీత్ లేకపోయినా ఇంకా ముత్తైదువగా ఉండటానికి కారణం అమితాబ్ బచ్చన్ అని చెప్పారు. బిగ్ బి పై ఉన్న పిచ్చిప్రేమతోనే ఇంకా సింధూరం పెట్టుకుంటున్నానని, ఇద్దరి మధ్య ఇంకా ఒకరికోసం ఒకరు చచ్చేంత ప్రేముందని తెలిపారు. బహుశా అందుకేనేమో బిగ్ బి గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే రేఖ తట్టుకోలేరు.