పిచ్చివాగుడు వాగితే తాట తీస్తా..మాధవీ లత కు శ్రీరెడ్డి వార్నింగ్

By రాణి  Published on  25 April 2020 6:58 AM GMT
పిచ్చివాగుడు వాగితే తాట తీస్తా..మాధవీ లత కు శ్రీరెడ్డి వార్నింగ్

సాధినేని యామిని టిడిపి నుంచి బీజేపీ లోకి చేరడం తో సినీ నటీమణులు మాధవీ లత - శ్రీ రెడ్డి ల మధ్య సోషల్ మీడియా వేదికగా కోల్డ్ వార్ మొదలైంది. మూడ్రోజులుగా ఇది కొనసాగుతూనే ఉంది. సాధినేని యామిని బీజేపీలో చేరడంపై మాధవీ లత మండిపడింది. యామిని బీజేపీలోకి రాకముందు పవన్ కల్యాణ్ పై పలు వ్యాఖ్యలు చేశారు. పవన్ కేవలం మల్లెపూలు నలిపేందుకే పనికొస్తారని కామెంట్ చేశారు. ఇప్పుడు పవన్ మద్దతిస్తున్న బీజేపీలోకే సాధినేని రాకపై మాధవీలత అదే తరహాలో వ్యాఖ్యలు చేసింది. మల్లెపూల వాసనల గురించి ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేసి, మల్లెపూల కథలు బాగా అల్లిన వారికి పదవులా అని వివాదాస్పద కామెంట్లు చేసింది మాధవీలత. దీనిపై శ్రీరెడ్డి స్పందించింది.

Also Read : కిడ్నాప్ చేసి.. నిర్బంధించి.. 13 రోజులుగా అదే పని

సాధినేని యామిని గురించి ఎవరైనా పిచ్చివాగుడు వాగితే తాట తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు..అలా వాగినవారి చరిత్రంతా బయటపెడతానని హెచ్చరించింది. యామిని తాను ఫుల్ సపోర్ట్ చేస్తున్నానని తెలిపింది శ్రీరెడ్డి.

శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాధవీలత స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసిందో లేదో తెలీదు కానీ..కొద్దిసేపటి క్రితం మాధవీ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘జనాలు మాట్లాడటం సాధారణం..తెలివిగల వారు వాటిని విని గ్రహిస్తారు. కొన్ని కుక్కలు మొరుగుతాయి. వాటిని ఎవరూ పట్టించుకోరు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థం అయిందనుకుంటా. నేను చాలా తెలివిగా మసులుకుంటాను..స్పెషల్లీ సోషల్ మీడియాలో'' అని కామెంట్ చేస్తూ నెట్టింట్లో ఓ వీడియో పోస్ట్ చేసింది మాధవీలత. అయితే ఇందులో తాను ఎవరి గురించి మాట్లాడుతున్నదీ ఖచ్చితంగా చెప్పలేదు.

Also Read : బయట తిరుగుతున్న కొడుకుని మందలించిన తండ్రి..క్షణికావేశంలో

మాధవీలత చేసిన కామెంట్లపై శ్రీరెడ్డి స్పందించింది. కుక్కంత హైట్ ఉండేవారు ఏనుగు మీద జోకులేస్తుంటే..దేనితో నవ్వాలో అర్థం కావట్లేదంటూ శ్రీరెడ్డి సెటైర్ వేసింది. అంతేకాక అసభ్యకర పదజాలాన్ని కూడా వాడింది. ఈ కామెంట్లపై మాధవీలత ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి. ఏదేమైనా ఒక మహిళా రాజకీయ నేత గురించి ఇద్దరు నటులు మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న కోల్డ్ వార్ చర్చనీయాంశంగా మారుతోంది.

Next Story
Share it