వరుసగా అత్యాచారాలు..తాజాగా గుంటూరులో

By రాణి  Published on  24 April 2020 3:37 PM GMT
వరుసగా అత్యాచారాలు..తాజాగా గుంటూరులో

ఎక్కడైనా ఒక్కచోట బాలిక పై అత్యాచారం జరిగితే చాలు. వరుసగా ఇలాంటి ఘటనలు వెలుగులోకొస్తాయి. ఆ మధ్య దిశ ఉదంతం తర్వాత దేశంలో అలాంటివే రెండు మూడు ఘటనలు వెలుగుచూశాయి. రెండ్రోజుల క్రితం మధ్యప్రదేశ్ లో ఓ వ్యక్తి ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకెళ్లి చిత్రహింసలు చేసి, కళ్లు పీకేసి అతి దారుణంగా అత్యాచారం చేశాడు. హైదరాబాద్ లోని కుత్భుల్లాపూర్ లో కూడా మతిస్థిమితం లేని బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. తాజాగా గుంటూరులో పదేళ్ల చిన్నారిపై వృద్ధుడు కామవాంఛ తీర్చుకున్న ఘటన చోటుచేసుకుంది.

Also Read : లైవ్ స్ట్రీమింగ్ లో అశ్లీల ఫొటోలు..అవి చూసి బ్యాడ్మింటన్ కోచ్ లంతా..

జిల్లాలోని నకరికల్లు మండలం కుంకగుంటలో ఇంట్లో ఒంటరిగా ఉన్న పదేళ్ల బాకిలపై కొత్తపల్లి మరియానందం (51) అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లుగా బాలిక తల్లి స్థానిక పీఎస్ లో ఫిర్యాదు చేసింది. తాను పొలం పనులకు వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న కూతురిపై వృద్ధుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఓ వైపు లాక్ డౌన్ డ్యూటీలో బిజీ ఉంటున్నపోలీసులకు ఇప్పుడు కొత్తగా వస్తున్న అత్యాచారాల కేసులు తలనొప్పిగా మారుతున్నాయి. ఎవరూ బయట తిరగొద్దు..బయటి వ్యక్తులను ఇళ్లలోకి రానివ్వొద్దని చెప్తున్నా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో ఏం చేయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. ఎంత కోపమొచ్చినా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోలేక మిన్నకుండాల్సిన పరిస్థితి.

Also Read : చరిత్రలోనే విషాద ఘటన..గర్ల్ ఫ్రెండ్ పై కోపంతో యువకుడు..

Next Story