లైవ్ స్ట్రీమింగ్ లో అశ్లీల ఫొటోలు..అవి చూసి బ్యాడ్మింటన్ కోచ్ లంతా..

By రాణి  Published on  24 April 2020 2:58 PM GMT
లైవ్ స్ట్రీమింగ్ లో అశ్లీల ఫొటోలు..అవి చూసి బ్యాడ్మింటన్ కోచ్ లంతా..

ఆన్ లైన్ తరగతులు నిర్వహించేందుకు, వీడియో కాన్ఫరెన్స్ లకు జూమ్ (zoom) యాప్ అంత క్షేమం కాదని కేంద్రప్రభుత్వం చెప్తూనే ఉంది. జూమ్ యాప్ ద్వారా ఇలాంటివి నిర్వహిస్తే డేటా చోరీ జరిగే అవకాశాలున్నాయని, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన డేటా, సాఫ్ట్ వేర్ రంగ డేటా, అప్లికేషన్లు ఇలా ఇతరత్రా డేటా జూమ్ లో చోరీకి గురయ్యే అవకాశముందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది.

Also Read : చరిత్రలోనే విషాద ఘటన..గర్ల్ ఫ్రెండ్ పై కోపంతో యువకుడు..

ఇకపై విద్యార్థులకు జూమ్ లో ఆన్ లైన్ తరగతులు నిర్వహించకూడదని కేంద్రం వెల్లడించిన కొద్ది రోజుల్లోనే ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది. అది కూడా భారత్ తో పాటు వివిధ దేశాలకు చెందిన బ్యాడ్మింటన్ కోచ్ లు ఆన్ లైన్ లో ఉండగానే. వందలాది మంది జూమ్ లో లైవ్ స్ట్రీమింగ్ లో ఉండగా అశ్లీల ఫొటోలు దర్శనమిచ్చాయి. ఆ సమయంలో హైదరాబాద్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా ఉన్నారు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం 12.40 గంటలకు జరిగింది. ఆ సమయానికి కోచ్ లు మాత్రమే ఉన్నారు కాబట్టి సరిపోయింది. విద్యార్థులు కూడా ఉండి ఉంటే చాలా ఇబ్బంది అయ్యుండేది. లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుండగా అశ్లీల ఫొటోలు ప్రత్యక్షమవ్వడంతో కొందరు వెంటనే సైన్ అవుట్ అయ్యారు.

Also Read : పోలీసుల సడన్ స‌ర్‌ప్రైజ్‌.. అవాక్కయిన ఇంటివారు

Next Story
Share it