78వ వసంతంలోకి అడుగుపెట్టిన బిగ్‌బీ.. చిరు బర్త్‌ డే విషెష్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Oct 2020 7:07 AM GMT
78వ వసంతంలోకి అడుగుపెట్టిన బిగ్‌బీ.. చిరు బర్త్‌ డే విషెష్‌

భారతీయ సినిమా దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ పుట్టిన రోజు నేడు(అక్టోబర్‌ 11). ఐదు దశాబ్దాలుగా భారత సినీ ఇండస్ట్రీని ఎలుతూ కోట్లాది మంది హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని బాలీవుడ్ సూపర్ స్టార్.. మెగాస్టార్‌గా పేరు ప్రఖ్యాతలను పొందారు అమితాబ్ బచ్చన్. ఎంద‌రో న‌టీన‌టుల‌కు ఆద‌ర్శం. 78వ వసంతంలోకి అడుగుపెట్టిన బిగ్‌బీకి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి.. బిగ్ బీ కి శుభాకాంక్ష‌లు తెలిపారు.

“నా ప్రియమైన బిగ్ బ్రదర్, ఇండియన్ సినిమాకు ‘బిగ్ బి’, టాలెంట్‌కి పవర్ హౌస్, నాకు ఎప్పటికీ మార్గనిర్దేశం చేసే కాంతిపుంజం, ద వన్ & ఓన్లీ అమిత్ జీ.. మీకు అద్భుతమైన పుట్టినరోజు శుభాకాంక్షలు!. మీరు మీ నటనాపటిమతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉండండి.. భవిష్యత్ లోకూడా మాకు స్ఫూర్తినిస్తూ ఉండండి.!” అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్‌ చేశారు.

అమితాబ్ బచ్చన్ 1942 అక్టోబర్ 11న అలహాబాద్‌లో ప్రసిద్ధ కవి హరివంష్ రాయ్ బచ్చన్, తేజీ బచ్చన్ దంపతులకు జన్మించారు. సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన తరువాత ఆయన నటి జయ బచ్చన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు కుమార్తె శ్వేతా బచ్చన్ నందా, కుమారుడు అభిషేక్ బచ్చన్ ఉన్నారు. ఇప్పటివరకు బాలీవుడ్ మెగాస్టార్ ఐదు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 15 ఫిలింఫేర్ అవార్డులు, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో అనేక పురస్కారాలను కైవసం చేసుకున్నారు. దీంతోపాటు భారత ప్రభుత్వం బీగ్‌ బీకి 1984 లో పద్మశ్రీ, 2001 లో పద్మ భూషణ్, 2015 లో పద్మ విభూషణ్ను ప్రదానం చేసింది. అంతేకాకుండా 2018 లో నటదిగ్గజానికి అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో కూడా సత్కరించారు.

Next Story