జగన్‌కు అమిత్ షా ఫోన్
By తోట వంశీ కుమార్ Published on 26 April 2020 3:37 PM ISTఏపీ సీఎం జగన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. లాక్‌డౌన్ పరిమాణాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ఇద్దరూ చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను ఫోన్ ద్వారా హోంమంత్రికి జగన్ వివరించారు. రాష్ట్రంలో విసృత్తంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి మిలియన్ జనాభాకు అత్యధిక పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా ఏపీ ప్రథమస్థానంలో ఉందని అమిత్‌షాకు జగన్ చెప్పారు. ఈనెల 20 తర్వాత లాక్‌డౌన్ సడలింపుల ప్రభావంపై మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 81 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1097 కి చేరింది. మొత్తం కేసుల్లో 231 మంది కోలకుని డిశ్చార్జి కాగా.. 835 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారి భారీన పడి ఇప్పటి వరకు రాష్ట్రంలో 31 మంది మృత్యువాత పడ్డారు