కరోనాతో మరో ప్రముఖ గాయకుడు మృతి
By రాణి Published on 3 April 2020 3:34 PM IST
ఎంత పేరు, పలుకుబడి, డబ్బు ఉన్నా కరోనా బారి నుంచి మాత్రం తప్పించుకోలేరని ఆది నుంచీ చెప్తున్న మాట. ప్రపంచం మొత్తాన్నీ గడగడలాడిస్తోన్న కరోనా బారిన పడిన ఇప్పటి వరకూ వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ప్రముఖ అమెరికన్ గాయకుడు ఆడమ్ ష్లెసింజర్ (52) కూడా కరోనాతో పోరాడుతూ మృతి చెందారు. గతవారం కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆడమ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందారు.
Also Read : బేజారవుతున్న బెజవాడ
గీతరచయితగా, గాయకుడిగా, స్వరకర్తగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆడమ్ ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ నామినేషన్లతో పాటు గ్రామీ, ఎమ్మీ పురస్కారాలను కూడా పొందారు. అమెరికా జానపద సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన సింగర్ జో డిఫీ (61) కూడా నాలుగురోజుల క్రితం కరోనా కాటుకు బలయ్యారు. ప్రపంచదేశాలన్నింటిలోనూ ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికాలోనే కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. శుక్రవారానికి అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య మూడు లక్షలకు చేరువైంది. దీంతో అధ్యక్షుడు ట్రంప్ ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని, మాస్క్ లు, శానిటైజర్లు వాడాలని సూచనలిస్తున్నారు.
Also Read : చైనా ప్రకటించిన కరోనా బాధితుల సంఖ్య సరికాదు..