బేజారవుతున్న బెజవాడ

By రాణి  Published on  3 April 2020 9:42 AM GMT
బేజారవుతున్న బెజవాడ

ఏపీలో రోజురోజుకూ పదుల సంఖ్యలో కరోనా వైరస్ కేసులు బయటపడుతున్నాయి. గురువారం రాత్రి 143 కేసులుండగా..శుక్రవారం ఉదయానికి ఈ సంఖ్య 161కి చేరింది. ఒకరు మృతి చెందగా..ఇద్దరు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 32 కరోనా కేసులు నమోదయ్యాయి. రెండో స్థానంలో కృష్ణాజిల్లా ఉంది. జిల్లా వ్యాప్తంగా 23 కేసులు నమోదవ్వగా విజయవాడ(బెజవాడ)లో 18 కరోనా పాజిటివ్ బాధితులున్నారు. దీంతో విజయవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు.

Also Read : రోగ నిరోధక శక్తిని పెంచుకోండిలా..

జగ్గయ్యపేటలో 2, నూజివీడు 2, నందిగామలో ఒక కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటంతో ఆ ప్రాంతాలన్నింటినీ అధికారులు రెడ్‌‌జోన్‌గా ప్రకటించారు. దీంతో గ్రామస్తులు తమ ఊర్లలోకి ఎవరూ రాకుండా ముళ్ల కంపలు, బండరాళ్లు అడ్డువేసి రోడ్లు బ్లాక్ చేస్తున్నారు. ఎలాంటి పని లేకుండా లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించి రోడ్లపై తిరుగుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.

Also Read : ఆమె 26 ఏళ్లుగా క్వారంటైన్ లోనే.. ఎందుకంటే

Next Story