అమెరికాలో హైదరాబాద్‌ యువతి హత్య.. అత్యాచారం చేసి ఆపై..!

By అంజి  Published on  26 Nov 2019 7:58 AM GMT
అమెరికాలో హైదరాబాద్‌ యువతి హత్య.. అత్యాచారం చేసి ఆపై..!

న్యూయార్క్‌: అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన ఆ యువతిపై కొందరు దుండగులు అత్యాచారం చేసి.. హత్యకు పాల్పడ్డారు. 19 ఏళ్ల రూత్‌ జార్జ్‌ చికాగోలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఇలియనాస్‌లో చదువుకుంటోంది. శుక్రవారం నుంచి రూత్‌ జార్జ్‌ తల్లిదండ్రులకు అందుబాటులోకి రాలేదు. దీంతో వెంటనే తల్లిదండ్రులు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. యూనివర్సిటీ సిబ్బంది, పోలీసులు రూత్‌ జార్జ్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో యూనివర్సిటీ గ్యారేజీలో సిబ్బందికి రూత్‌ జార్జ్‌ మృతదేహం లభ్యమైంది. వెంటనే జార్జ్‌ మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 22న యువతిపై అత్యాచారం జరిగిందని. ఆ తర్వాత దారుణ హత్యకు గురైందని వైద్యులు తెలిపారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రూత్‌ జార్జ్‌ను హత్య చేసిన డోనాల్డ్‌ తుర్‌మాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. రుత్‌జార్జ్‌ మృతిచెందడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Next Story
Share it