అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ ఓటమి ఖాయం.. స్పష్టం చేసిన సర్వే

By సుభాష్  Published on  22 May 2020 3:56 AM GMT
అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ ఓటమి ఖాయం.. స్పష్టం చేసిన సర్వే

ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌.. అగ్రరాజ్యం పెద్దన్న డొనాల్డ్‌ ట్రంప్‌ను కంటిమీద కునుకు లేకుండా చేస్తుండగా, ఇప్పుడు అధ్యక్ష ఎన్నికలపై మరో టెన్షన్‌ పుట్టికుంది. అమెరికాలో ఈ ఏడాది నంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ఘోరంగా ఓటమి చవిచూస్తారని ఓ అమెరికన్‌ అధ్యయనం వెల్లడించింది. ఆ అధ్యయనం ప్రకారం.. కరోనా వైరస్‌ విపత్కర నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ దారుణంగా పడిపోయింది. ఈ కారణంగా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ఓడిపోవడం ఖాయమని ఓ సర్వే తేల్చి చెప్పింది. ఆక్స్‌ఫరర్డ్‌ ఆర్థికవేత్తలు కొత్త ఎన్నికల నమూనా ద్వారా ఎన్నికలపై అంచనా వేశారు. ముందు నుంచి ట్రంప్‌ అప్రమత్తం చేయకపోవడంతో అమెరికాలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటి వరకూ 96వేల వరకూ కరోనా మరణాలు సంభవించాయి. దీంతో పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం కారణంగా అమెరకన్లు ట్రంప్‌ను తిరిగి ఎన్నోవడం చాలా కష్టమని పేర్కొన్నారు. అధ్యయనం ప్రకారం.. ట్రంప్‌కు 35శాతం ఓట్లు మాత్రమే వస్తాయని తేలింది.

ట్రంప్‌కు కరోనా పెద్ద దెబ్బ

కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ట్రంప్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని సర్వేలో తేలింది. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందక ముందు చేసిన సర్వేలో ట్రంప్‌కు 55 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేయగా, ప్రస్తుతం ఆ శాతం తీవ్రంగా పడిపోయింది. కరోనా మహమ్మారి కారణంగా ట్రంప్‌ ఓటమి చెందడం తప్పదని ఆక్స్‌ఫర్డ్‌ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి వల్ల ట్రంప్‌కు భారీ షాక్‌ తగలనుంది. కాగా, ఈ ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఒక వేళ ట్రంప్‌ విజయం సాధిస్తే అది అద్భుతమనే చెప్పాలని నివేదిక పేర్కొంది. కరోనా లాంటి విపత్కర సమయంలో ట్రంప్‌కు మరిన్ని కష్టాలు తప్పవని సర్వేలో తేలింది.

అమెరికాలో ఈ అధ్యయనం ఖచ్చితమైనది

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో అంచనాకు సంబంధించి అమెరికాలో ఈ అధ్యయనం చాలా ఖచ్చితమైనదని ఎంతో పేరుంది. 1948 నుంచి ఇప్పటి వరకూ ఈ అధ్యయనం ఎన్నో నిజాలను బయటపెట్టింది. కేవలం 1968, 1976లో మాత్రమే దాని అంచనా విఫలమైంది. నిరుద్యోగిత రేటు 13శాతానికి మించగా, గృహ ఆదాయం 6శాతం కన్న తక్కువగా ఉంది. ఇక ఆర్థిక వ్యవస్థ పరిస్థితి మాత్రం భయానకరంగా ఉంటుందని నివేదిక తెలిపింది. ఇక అంతర్జాతీయ సంక్షోభ సమయంలో నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరుకుంటుందని, ఆర్థిక వ్యవస్థ కారణంగా ట్రంప్‌ను తిరిగి అధ్యక్షుడు కావడం అసాధ్యమని ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. ఇక మరో వైపు డెమోక్రటిక్‌ పార్టీ విజయాన్ని ఆర్థిక అంశాలు స్పష్టంగా చూపిస్తున్నాయని అధ్యయనం స్పష్టం చేసింది.

Next Story