టెన్షన్‌.. టెన్షన్.. ఒక్క రోజే లక్ష కరోనా కేసులు.. అమెరికాలో 96వేల మరణాలు

By సుభాష్  Published on  22 May 2020 3:05 AM GMT
టెన్షన్‌.. టెన్షన్.. ఒక్క రోజే లక్ష కరోనా కేసులు.. అమెరికాలో 96వేల మరణాలు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ అతాలాకుతలం చేస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. గురువారం ఒక్కరోజే లక్ష కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, గురువారం ఉదయం వరకూ మొత్తం కేసులు 50,82,661 ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 51,89,178కి చేరింది. ఇక మరణాల సంఖ్యను చూస్తే మాత్రం భారీగానే పెరిగింది. మొత్తం 3,34,073 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటి వరకూ ఒక్క అమెరికాలోనే 96,298 మంది కరోనాతో మృతి చెందారు. ఇక 20,79,556 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 27,76,550 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అందులో 45,636 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.

ఇక దేశాల వారీగా చూస్తే.. గురువారం ఒక్క రోజు అమెరికాలో 1,359, బ్రెజిల్‌లో 1153, మెక్సికోలో 425, యూకేలో 3338, ఇటలీలో 157, రష్యాలో 127, పేరులో 124, కెనడాలో 121 మంది కరోనా వైరస్‌తో మరణించారు.

ఇక ఇప్పటి వరకూ మరణాల సంఖ్య చూస్తే...

అమెరికాలో మొత్తం కేసులు 1,620,457 కేసులుంటే, 96,295 మంది మృతి చెందారు. రష్యాలో 317,554 కేసులుంటే, 3,099 మంది మృతి చెందారు. బ్రేజిల్‌లో 310,087 కేసులుంటే, 20,047 మంది మృతి చెందారు. యూకేలో 250,908 కేసులుంటే, 36,042 మంది మృతి చెందారు. ఇటలీలో 228,006 కేసులుంటే, 32,486 మంది మృతి చెందారు. పెరూలో 108,769 కేసులుంటే, 3,148 మంది మృతి చెందారు. కెనడాలో 81,324 కేసులుంటే, 6,152 మంది మృతి చెందారు. మెక్సికోలో 56,594 కేసులుంటే, 60,090 మంది మృతి చెందారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కరోనాకు వ్యాక్సిన్‌ కనిపెట్టేందుకు భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు సైతం తలమునకలవుతున్నాయి. శాస్త్రరవేత్తలు ఎంతో కృషి చేస్తున్నారు. వైరస్‌ను అరికట్టేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం ఆగడం లేదు. మృత్యువును వెంటాడుతోంది.

Next Story