రాయుడు ముక్కొపి.. చెన్నై అత‌డిని ఎందుకు తీసుకుందో అర్థం కాలేదు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 April 2020 3:34 PM GMT
రాయుడు ముక్కొపి.. చెన్నై అత‌డిని ఎందుకు తీసుకుందో అర్థం కాలేదు

టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్ అంబ‌టి రాయుడి పై వెస్టిండీస్ క్రికెట‌ర్ డ్వేన్ బ్రావో సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశాడు. అంబ‌టి రాయుడు ముక్కోపి అని, అత‌డిని చెన్నై.. ఎందుకు జ‌ట్టులోకి తీసుకుందో అర్థం కాలేద‌ని వ్యాఖ్యానించాడు. కాగా.. ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)లో ఈ ఇద్ద‌రు ఆట‌గాళ్లు చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌రుపున ఆడుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా సీఎస్‌కే ఇన్ స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడుతూ.. బ్రావో ఈ వ్యాఖ్య‌లు చేశాడు.

ఐపీఎల్ లో రాయుడితో క‌లిసి ఆడాన‌ని.. అయితే.. కొన్ని సంద‌ర్భాల్లో అత‌డిని త‌ప్పుగా అర్థం చేసుకుని తెలిపాడు ఈ చైన్నై ఆల్‌రౌండ‌ర్‌. అంబటి రాయుడు త‌న ఫేవరెట్‌ ప్లేయర్లలో ఒకడని, ఇద్ద‌రం క‌లిసి ముంబై త‌రుపున ఆడామ‌న్నాడు. అయితే.. క‌లిసి ఆడిన సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌న్నాడు. నా త‌ర‌హాలోనే అత‌ను ఓ ప్లేయ‌ర్‌. అయితే.. అత‌డికి కోపం ఎక్కువ. అత‌డు క‌రెక్టు కాద‌ని అనుకునేవాడిని. ఆ విష‌యాన్ని త‌ప్ప‌ని రాయుడు నిరూపించాడని చెప్పాడు.

చెన్నై జ‌ట్టుకు ఆడిన తొలి సీజ‌న్‌లో రాయుడు నా ప‌క్క‌న కూర్చోనేవాడు అయితే.. 'నాకు అది న‌చ్చేది కాదు. అందుక‌నే అత‌డితో ఎక్కువ‌గా నెగిటివ్ విష‌యాలే మాట్లాడేవాడిన‌ని అన్నాడు. దీంతో రాయుడితో అంత స‌ఖ్య‌త ఉండేది కాదు. నువ్వు ఒక చెత్త ప్లేయ‌ర్ వి. నీ అవ‌స‌రం చెన్నై జ‌ట్టుకు లేదు. అస‌లు నిన్ను చెన్నై జ‌ట్టుకు ఎందుకు తీసుకుందో అర్థం కావ‌డం లేద‌ని రాయుడిని ఏడిపించ‌డం' అంటే చాలా ఇష్ట‌మ‌న్నాడు. అయితే.. 'అత‌నో ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తి. మీరు ఏ వ్య‌క్తి.. మీరు ఏ వ్యక్తి గురించైనా తెలుసుకోవాలంటే ముందు అతనితో సఖ్యత ద్వారానే తెలుసుకుంటాం. ఒకవేళ తెలియకపోతే సదరు వ్యక్తి గురించి చెడు అభిప్రాయం వస్తుంది. రాయుడు నిజమైన క్రికెటర్‌. క్రికెట్‌ను బాగా ఆస్వాదిస్తాడు’ అని బ్రేవో తెలిపాడు.

Next Story