తండ్రైన అంబటి రాయుడు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 July 2020 8:00 AM GMT
తండ్రైన అంబటి రాయుడు..!

టీమ్ ఇండియా, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు తండ్రయ్యాడు. రాయుడు భార్య చెన్నుపల్లి విద్యా ఆదివారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. జులై 12, ఆదివారం నాడు అంబటి రాయుడు తాను తండ్రయినట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడు. రాయుడు ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఈ విషయాన్ని పోస్టు చేసింది.

“Now the off-field lessons from the #DaddiesArmy shall all be put to use! #WhistlePodu,” అంటూ చెన్నై సూపర్ కింగ్స్ అంబటి రాయుడు తండ్రైన విషయాన్ని తెలిపింది. ఆ ఫోటోలో రాయుడు జంటతో పాటూ వారి కుమార్తె కూడా ఉంది. పలువురు ఆటగాళ్లు రాయుడుకు కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేష్ రైనా కూడా తన సామాజిక మాధ్యమాల్లో అంబటి రాయుడుకు బెస్ట్ విషెస్ చెప్పాడు. అభిమానులు కూడా పెద్ద ఎత్తున విషెస్ చెబుతూ ఉన్నారు. రాయుడు, విద్యా 2009లో పెళ్లి చేసుకున్నారు.

అంబటి రాయుడు భారత్ తరపున 55 వన్డేలు ఆడాడు, ఆరు టీ20 మ్యాచ్ లు ఆడాడు. అంబటి రాయుడు చివరిసారిగా మార్చి 2019న భారతజట్టు తరపున ఆడాడు. ఆ తర్వాత 2019 ఐసీసీ వరల్డ్ కప్ కు అంబటి రాయుడును సెలెక్ట్ చేయడం పెద్ద వివాదమే అయింది. తాను రిటైర్మెంట్ తీసుకుంటున్నానని చెప్పి.. ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. డొమెస్టిక్ క్రికెట్ లో హైదరాబాద్ తరపున ఆడుతూ ఉన్నాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతూ ఉన్నాడు. తిరిగి భారతజట్టులో స్థానం సంపాదించాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

Next Story