ఆ క్రేజీ కాంబినేషన్ మళ్లీ పట్టాలెక్కింది.. ఇక పండగే.!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Oct 2019 4:18 PM ISTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ఓ మూవీ రూపొందనుంది. అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ మూవీ అక్టోబర్ 30న పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఇందులో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియాతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సినీ ప్రముఖుల సమక్షంలో ప్రారంభమైన.. ఈ సినిమా ముహుర్తపు సన్నివేశానికి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు.
ఆర్య, ఆర్య 2 చిత్రాల తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ & సుకుమార్ కాంబినేషన్‌లో ఈ చిత్రం రానుంది. దీంతో అటు అభిమానుల్లోను, ఇటు ఇండస్ట్రీలోను ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గతంలో అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్ కాంబినేషన్ లో ఆర్య, ఆర్య 2 మ్యూజికల్ హిట్స్ అందుకున్నాయి. అలాగే బన్నీ & దేవి కాంబినేషన్ లో వచ్చిన బన్నీ, సన్ ఆఫ్ సత్యమూర్తి, డీజే సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ఈ కొత్త సినిమాకి సంబంధించి పూర్తి వివరాలను చిత్ర బృందం త్వరలోనే తెలియచేయనున్నారు.