దాదా ఆల్ ది బెస్ట్...!!- యువీ, భజ్జీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Oct 2019 6:47 PM GMT
దాదా ఆల్ ది బెస్ట్...!!- యువీ, భజ్జీ

బీసీసీఐ అధ్యక్షుడిగా ఓకే అయిన నేపథ్యంలో గంగూలీకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తన సహచర ఆటగాళ్ల నుంచి ప్రశంసలు ట్విటర్ వేదికగా వెల్లువెత్తుతున్నాయి . గంగూలీకి యువరాజ్ విషెస్ చెప్పాడు. గుడ్ లక్ చెబుతూనే...ఆటగాళ్ల గురించి బాగా ఆలోచించాలి అన్నాడు. క్రికెటర్ పాలనలొకి దిగడం బాగుంది. ఆటగాళ్ల కోణంలోంచి ఆలోచించమని యువీ ట్విట్ చేశాడు. యువీ ట్వీట్‌పై గంగూలీ స్పందించాడు. ‘థ్యాంక్యూ బెస్ట్‌. ఇండియా కోసం ప్రపంచ కప్‌లు గెలిచావు. ఇక ఆట కోసం కొన్ని మంచి పనులు చేయాలి. నువ్వు నా సూపర్‌స్టార్‌వి. ఆ దేవుడి దీవెనలు నీకు ఉంటాయి’ అని ట్విట్ చేశాడు.తనకు విషెస్‌ చెప్పిన ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ట్వీట్‌కు సైతం దాదా ఈ తరహాలోనే స్పందించాడు. ‘ థాంక్యూ భజ్జీ. నువ్వు ఎలాగైతే భారత్‌కు విజయాలు అందించావో అదే తరహా నీ సహకారం బోర్డ్‌కు కావాలి. భజ్జీ.. నీ అవసరం ఉంది’ అంటూ గంగూలీ ట్వీట్‌ చేశాడు.గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు అవుతుండటంతో ఆయన అభిమానులు తెగ ఆనందపడుతున్నారు. గంగూలీ రాకతో బీసీసీఐలో కొత్త శకం ప్రారంభం అయినట్లైనని చెబుతున్నారు. యువ క్రికెటర్లకు ప్రోత్పాహం ఉంటుందని నమ్ముతున్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు గంగూలీ ప్రాధాన్యతను ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Next Story
Share it