మద్యం టెండర్లలో తోపులాట..!!

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 16 Oct 2019 7:22 PM IST

మద్యం టెండర్లలో తోపులాట..!!

మల్కాజ్‌ గిరి: మద్యం టెండర్లు చివరి రోజు కావడంతో రసాభాసగా మారింది. తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నాగోల్ లోని ఓ గార్డెన్ లో ఏర్పాటు చేసిన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మద్యం పాలసీని టెండర్లలో ప్రాంతీయ విభేదాలు తలెత్తాయి. నాన్‌ లోకల్ వాళ్లు టెండర్లు వేయొద్దంటూ లోకల్ వారు అడ్డుకున్నారు . దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి గలాటాను ఆపేశారు.

150 దరఖాస్తులు వేసిన ఒక మద్యం వ్యాపారి

రాష్ట్రంలో 2216 మద్యం దుకాణాలు దక్కించుకోవడానికి పెద్ద సంఖ్యలో లిక్కర్ వ్యాపారులు పోటీపడుతున్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు 30 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.సాయంత్రం 4 గంటల లోపల ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చిన వారందరి దగ్గర నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు దరఖాస్తులు ద్వారా ప్రభుత్వానికి రూ.600 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎక్సైజ్ కార్యాలయాల దగ్గర ... పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వేసేందుకు క్యూలో ఉన్న మద్యం వ్యాపారులున్నారు. రాత్రి వరకు దరఖాస్తు కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంది. 2017 లో వచ్చిన 40 వేల దరఖాస్తులకు మించి ఈసారి వస్తాయని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ సిటీ లో ఒక ప్రాంతానికి చెందిన వ్యాపారి ఏకంగా 150 దరఖాస్తులు వేసినట్లు తెలుస్తోంది.

Next Story