తెలంగాణలో కఠినమైన మద్యం మార్గదర్శకాలు...!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Oct 2019 9:06 AM GMT
తెలంగాణలో  కఠినమైన మద్యం మార్గదర్శకాలు...!!

హైదరాబాద్‌: రాష్ట్రంలో మద్యం సిండికేట్లను నిలువరించడానికి మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రభుత్వం. నవంబర్ 1, 2019 నుంచి మొదలయ్యే మద్యం క్రయ విక్రయాల కోసం కఠిన నిబంధనలను ప్రభుత్వం రూపొందించింది. A4 మద్యం షాపుల టెండర్ల ప్రక్రియలో కొందరు కాంట్రాక్టర్లు బెదిరింపులకు దిగడం ఎక్సైజ్ శాఖ దృష్టికి వచ్చింది. అనైతికంగా మద్యం వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలకు ఎక్సైజ్ శాఖ సిద్ధమైంది. లైసెన్స్ నిబంధనలకు వ్యతిరేఖమైనా, చట్ట వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడినా తెలంగాణ ఎక్సైజ్ చట్టం సెక్షన్ 36బీ, 41ల ప్రకారం కఠిన చర్యలుంటాయని ప్రభుత్వం ప్రకటించింది. ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. చట్ట ప్రకారం 6 నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష, వెయ్యి జరిమానా, ఎక్సైజ్‌ శాఖ తరపున రూ.2 లక్షల నుంచి రూ.3లక్షలు అపరాధ రుసం కట్టే విధంగా కఠిన నిబంధనలు రూపొందించారు.

ఎంఆర్పీ కంటే ఎక్కువ రేట్లకు మద్యం అమ్మితే చట్ట ప్రకారం 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు జైలుశిక్ష, వెయ్యి జరిమానా, ఎక్సైజ్ శాఖ తరఫున మరో 2 నుంచి 3 లక్షల అపరాధ రుసుము కట్టే విధంగా నిబంధనలు రూపొందించారు.

Next Story