'అల వైకుంఠపురములో'.. షూట్ కి ప్యాకప్ !

By Newsmeter.Network  Published on  29 Dec 2019 8:58 AM GMT
అల వైకుంఠపురములో.. షూట్ కి ప్యాకప్ !

అల వైకుంఠపురములో తాజాగా మరో అప్ డేట్ వదిలింది చిత్రబృందం. ఈ రోజుతోటి ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయిందని చిత్రబృందం అధికారికంగా ట్వీట్ చేసింది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తి కావస్తున్నాయి. బన్నీ డబ్బింగ్ కూడా చాల భాగం చెప్పేశాడు. క్లైమాక్స్ ఒక్కటే బ్యాలెన్స్ ఉందట. సంక్రాంతికి ఈ సినిమాని గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో రిలీజ్ డేట్ కి వారం ముందే ఫస్ట్ కాపీ రెడీ చేసే విధంగా ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. ఇక బన్నీ - త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో మొదటినుండీ ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా 'జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న త్రివిక్రమ్ - బన్నీ, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో రాబోతున్నారు.

అందుకే ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా శాటిలైట్ అండ్ డిజిటల్ హక్కుల్ని కూడా భారీ మొత్తానికి అమ్మారు. కాగా ఈ చిత్రంలో బన్నీ సరసన టాల్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే డీజే సినిమాలో అల్లు అర్జున్ సరసన ఆడిపాడింది. అలాగే ఈ చిత్రంలో అక్కినేని హీరో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తుండగా ఒకప్పటి హాట్ బాంబ్ టబు కూడా కీలకమైన్ పాత్రలో నటిస్తోంది. క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్నట్లు ఈ సినిమాలో అల్లు అర్జున్ ను త్రివిక్రమ్ కాస్త వైవిధ్యంగా చూపిస్తున్నాడట.

Next Story
Share it