అల్లు అర్జున్‌ అభిమానులకు ఇక పండగే

By సుభాష్  Published on  29 Dec 2019 9:12 AM GMT
అల్లు అర్జున్‌ అభిమానులకు ఇక పండగే

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన మూవీ అలా వైకుంఠపురం. త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను అల్లు అరవింద్‌, ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్‌-బన్ని కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూడో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది వరకు వచ్చిన ఈ రెండు సినిమాలు మంచి విజయాలే సాధించాయి. ఇక సామజవరగమణ, రాములో రాములా, బుట్టబొమ్మా సాంగ్స్‌ తో ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌కి వెళ్లిపోయాయి.

ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా, జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా విడుదలకు ముందు ప్రీరిలీజ్‌ వేడుకల మాదిరిగి భారీ ఎత్తున నిర్వహించాలని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో భారీగా మ్యూజికల్‌ కన్సెర్ట్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుకను జనవరి 6న యూసఫ్‌ గూడ పోలీసు గ్రౌండ్‌ లోసాయంత్రం 5 గంటలకు ప్రారంభించాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు. అంతేకాదు టాలీవుడ్‌ చరిత్రలోనే 'అల వైకుంఠపురములో' మ్యూజికల్‌ కాన్సెర్ట్‌ నిలిచిపోయే విధంగా ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. ఈ వేడుకకు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరు కానున్నారని తెలుస్తోంది.

Maxresdefault

Next Story