బ‌న్నీ 'అల‌... వైకుంఠ‌పుర‌ములో' విడుద‌ల తేదీ ఖ‌రారు

By Medi Samrat  Published on  14 Oct 2019 12:37 PM GMT
బ‌న్నీ అల‌... వైకుంఠ‌పుర‌ములో విడుద‌ల తేదీ ఖ‌రారు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నభారీ చిత్రం అల వైకుంఠపురంలో... ఈ సినిమా వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ కావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్ప‌డ్డాయి. ఈ భారీ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు ‘గీతాఆర్ట్స్’, ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల అవుతోందని చిత్ర బృందం ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది.

'అల వైకుంఠపురంలో' చిత్రంలోని మొదటి పాట ‘సామజవరగమన’పాట‌ను ద‌స‌రా సంద‌ర్భంగా రిలీజ్ చేయ‌డం.. ఈ పాట‌కు విశేష స్పంద‌న రావ‌డం తెలిసిందే. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ చిత్రం చక్కటి ఫామిలీ ఎంటర్ టైనర్ గా శరవేగం గా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ప్రధాన తారాగణం పై పాట చిత్రీక‌రిస్తున్నారు. ఇందులో అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ ముఖ్య పాత్ర పోషిస్తుండ‌డం విశేషం.

Next Story
Share it