అక్కినేని.. దగ్గుబాటి ఫ్యామిలీల మధ్య ఏం జరిగింది.?
By Newsmeter.Network Published on 12 Dec 2019 5:56 PM ISTఅక్కినేని హీరో నాగార్జున, దగ్గుబాటి హీరో వెంకటేష్ మధ్య ఉన్న సంబంధం, అనుబంధం గురించి తెలిసిందే. వీరి మధ్య ఎంత అనుబంధం ఉన్నప్పటికీ ఇద్దరూ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. ప్రేక్షకాభిమానులు నాగ్ - వెంకీ కలిసి సినిమా చేస్తే బాగుంటుందని చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు కానీ.. కుదరలేదు.
ఇప్పుడు అక్కినేని హీరో నాగ చైతన్య, దగ్గుబాటి హీరో వెంకటేష్ కలిసి వెంకీమామ సినిమా చేసారు. అయితే.. అక్కినేని, దగ్గుబాటి ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంది. మేటర్ ఏంటంటే...అక్కినేని ఫ్యామిలీ హీరో చైతన్యకు బ్యానర్లు కడుతున్న అభిమానులు ఎక్కడా వెంకటేష్ పేరును ప్రస్తావించడం లేదు. అలాగే వెంకటేష్ కు బ్యానర్లు కడుతున్న అభిమానులు చైతన్య పేరును ప్రస్తావించడం లేదు.
వెంకీ ఫ్యాన్స్ ఇది వెంకటేష్ సినిమా.. బ్యానర్లు మేమే కడతాం. మీరు కట్టద్దు అని అక్కినేని అభిమానులకు చెబుతున్నారని.. ఈ విధంగా ఈ ఇద్దరి హీరోల అభిమానుల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే... ఈ సినిమా పై నాగార్జున అసలు స్పందించలేదు. ఖమ్మంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గానీ, హైదరాబాద్ లో జరిగిన మ్యూజికల్ నైట్ పొగ్రామ్ కి కానీ రాలేదు. కనీసం ట్విట్టర్ లో వెంకీమామ ట్రైలర్ గురించి కూడా స్పందించలేదు.
నాగ్ వెంకీమామ పై ఎందుకు స్పందించలేదు అనేది అర్ధం కావడం లేదు. ఈ రోజు (డిసెంబర్ 12)న రిలీజైన మమ్ముట్టి మమాంగం సినమా ట్రైలర్ ను నాగార్జున ట్విట్టర్ లో రిలీజ్ చేసారు కానీ.. తనయుడు నాగ చైతన్య మేనమామ వెంకటేష్ తో కలిసి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం వెంకీమామ గురించి ఎందుకు స్పందించలేదు..? అసలు దీనికున్న అసలు కారణం ఏంటి..? అనేది తెలియక కొంత మంది సినీ ప్రముఖులు సైతం ఏం జరిగింది అని ఆరా తీస్తున్నారు. ఈ విధంగా ఫిల్మ్ నగర్ లో ఇది హాట్ టాపిక్ అయ్యింది. మరి.. రేపే వెంకీమామ రిలీజ్. రేపైనా నాగ్ స్పందిస్తారేమో చూడాలి.