హైదరాబాద్ : శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ లో చట్ట వ్యతిరేకంగా విదేశీ ధనం తీసుకుపోతుండగా సిఐఎస్ఎఫ్ బలగాలు అడ్డుకున్నాయి. అబుదాబి వెళ్లాల్సిన ఒక ప్రయాణీకుడు, సుమారు 8 లక్షల రూపాయలకు సమానమైన సౌదీ రియాల్ ను తీసుకెళ్తుండగా పట్టుబడ్డాడు. అతని పేరు హబీబ్ అలీ అల్కాఫ్ గా తెలుస్తోంది. అతనిని డబ్బుతో సహా విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు.

ఆదివారం రాత్రి సుమారు గం.7.30ని. లకు హబీబ్ ఏతిహాద్ విమానం AY 0277 ఎక్కేందుకు వచ్చాడు. తనతో పాటు అట్టపెట్టె లో సామానులు తెచ్చాడు.

క్షుణ్ణంగా పరిశీలించగా సబ్ ఇన్స్పెక్టర్ సోనూ శర్మ అట్టపెట్టెలో అనుమానాస్పద పదార్ధాలు ఉన్నట్టు కనుగొన్నారు. పెట్టె ను తెరచి వెతకగా అందులో 45,000 సౌది రియాల్ బయటపడ్డాయి. హబీబ్ వద్ద వీటికి సంబంధించిన పత్రాలు ఏమీ లేనందున అతనిని అదుపులోకి తీసుకున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story