అడ్వెంచర్‌ అర్బన్‌ పార్క్‌ @ హైదరాబాద్‌..!

By అంజి  Published on  19 Dec 2019 10:42 AM GMT
అడ్వెంచర్‌ అర్బన్‌ పార్క్‌ @ హైదరాబాద్‌..!

ముఖ్యాంశాలు

  • అడ్వెంచ‌ర్ జోన్, జంగిల్ క్యాంప్ సెక్టార్లుగా పార్క్‌ ఏర్పాటు
  • చిన్న పిల్లల కోసం ప్రత్యేక ఆట స్థలం ఏర్పాటు
  • అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌ను ప్రారంభించిన మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి
  • రాష్ట్ర వ్యాప్తంగా 94 పార్క్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు
  • ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన 31 ఫారెస్ట్‌ పార్క్‌లు

హైదరాబాద్‌ నగర వాసులకు మరో అడ్వెంచర్‌ పార్క్‌ అందుబాటులోకి వచ్చింది. నగర శివారులోని గోల్కొండ, తుక్కుగూడ గ్రామాల మధ్యలో మసీదుగడ్డ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఏర్పాటు చేసిన అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌ మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. 180.03 హెక్టార్లలో రూ.4.34 కోట్ల వ్యయంతో ఈ పార్క్‌ను నిర్మించారు. అటవీ, పర్యావరణ, న్యాయదేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ పార్క్‌ వన ప్రేమికులకు ఎంతో ఆహ్లాదకరమైన వాతవావరం అందిస్తుందని. నగరవాసులకు శారీరక ధారుడ్య, మానోసికోల్లాసం కల్పిస్తుందన్నారు. చెట్లను పెంచి రాష్ట్రాన్ని సస్యశామలం చేసేందుకు సీఎం కేసీఆర్‌ అహర్నిషలు కృషి చేస్తున్నారని తెలిపారు. అడవుల సంరక్షణ, వాటి అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోందని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని నగరాలకు దగ్గరలో ఉన్న రిజర్వ్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఫారెస్ట్‌ రిజర్వ్‌ బ్లాక్‌ల్లో పార్క్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. నగరాలకు పార్క్‌లు ఊపిరితిత్తులుగా స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మొత్తం 94 పార్క్‌లను ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో పార్క్‌ను ఒక్కో థీమ్‌తో నిర్మించనున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 60 పార్క్‌లు, ఇతర పట్టణాలు, నగరాల్లో మరో 34 పార్క్‌లు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. 31 పార్క్‌లు ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ పార్క్‌లను నగర వన ఉద్యాన యోజన, కంపా, ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ నిధులతో అభివృద్ధి చేస్తున్నారు.

హైదరాబాద్‌లో ఉన్నత జీవన ప్రమాణాలు కలిగి ఉండే నగరంలో అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. విశ్వ నగరంగా గుర్తింపు పొందతున్న హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంలో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. మసీదుగడ్డ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఏర్పాటు చేసిన అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌ బాగా నిర్మించారని ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. నగరవాసులు కుటుంబంతో రోజంతా పార్క్‌లో ఆహ్లాదకరంగా గడిపేందుకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు.

హైదరాబాద్‌ నగరవాసులకు ఉన్నత జీవన వాతావరణం కల్పించడంలో భాగంగానే అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌ను ఏర్పాటు చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కాంక్రీట్‌ జంగిల్‌ నగరాలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌ హైదరాబాద్‌ నగరవాసులకు వరంగా మారిందన్నారు. రంగారెడ్డి జిల్లాలో మరిన్ని పార్క్‌లు ఏర్పాటు చేయాలని కోరిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. సీఎం కేసీఆర్‌, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story