కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ను విధించింది. భారత్‌దేశం మొత్తం సుమారు రెండు నెలలుగా లాక్‌డౌన్‌లోనే ఉంటుంది. ప్రజలెవరూ ఇండ్ల నుంచి బయటకు రావడం లేదు. వచ్చినా పోలీసులు వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి ఇండ్లకు పంపిస్తున్నారు. ఇటీవల కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించాయి. దీంతో అవసరం ఉన్నవారు తమ పనులకోసం బయటకు వస్తున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సూచనల మేరకు దుకాణాలు ఓపెన్‌ అవుతున్నాయి.

Also Read :నామినేషన్‌ దాఖలు చేసిన మహారాష్ట్ర సీఎం

లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా ఉపాధి కోల్పోయిన లక్షలాది మంది వలస కూలీలు తమ తమ స్వగ్రామాలను వెళ్లేందుకు వివిధ మార్గాలను వెతుకుంటున్నారు. దీంతో కేంద్రం వారి ఇబ్బందులను గుర్తించి వారి తమ తమ రాష్ట్రాలకు తరలించేందుకు ‘శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్ల’ను ఏర్పాటు చేసింది. ఈ శ్రామిక్‌ రైళ్లలో వారివారి స్వస్థలాలకు తరలించే చర్యలు చేపట్టింది. గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌ నుండి ఒడిశాకు చెందిన వలస కార్మికుల తమ సొంతూళ్లకు బయలుదేరారు. పలువురు కార్మికులు తమ సొంత ప్రాంతమైన ఒడిశాలోని ఆంగుల్‌ జిల్లా స్టేషన్‌కు రైలు చేరుకొనే సరికి రైళ్లోనుంచి దూకేశారు. స్టేషన్‌లో దిగితే అందరిని క్వారంటైన్‌కు పంపిస్తారని ప్రభుత్వం ప్రకటించడంతో ఈ పనికి పాల్పడ్డారు. దూకినవారిలో ఎవరికి గాయాలు కాకపోవటం గమనార్హం. కానీ అలా దూకైనా వారు క్వారంటైన్‌ నుంచి తప్పించుకున్నారా అంటే అదీలేదు. ఈ విషయం గమనించిన బెనగాడియా గ్రామ సర్పంచ్‌ బిరాబిరా నాయక్‌ వారిలో నుంచి ఏడుగురిని పట్టుకొని అధికారులకు అప్పగించారు. జగత్‌సింగ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించారు.

Also Read :బాలీవుడ్‌కు రంగమత్త..!

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *