ముఖ్యాంశాలు

  • మేడ్చల్‌: జవహర్‌నగర్‌ కాప్రా సాకేత్‌ మిథులలో విషాదం
  • దమ్మాయిగూడ శ్రీఆదిత్య ఆస్పత్రి ఎండీ రవీందర్‌ కుమార్‌ ఆత్మహత్య
  • గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న రవీందర్‌

మేడ్చల్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దమ్మాయిగూడ శ్రీఆదిత్య ఆస్పత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రవీందర్‌ కుమార్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కాప్రా సాకేత్‌ మిథులలో జరిగింది. సోమవారం తన లైసెన్స్ గన్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ రవీందర్‌.. తన చావుకు ఆర్థిక ఇబ్బందులే కారణమంటూ సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు.

ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్‌తో పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్‌ రవీందర్‌ సిద్దిపేట వాసి అని పోలీసులు తెలిపారు. రవీందర్‌ ఆత్మహత్యతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

Also Read:

ముదిరిన సెల్ఫీ పిచ్చి..పెదనాన్నను చంపి సెల్ఫీ

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.