కేజీఎఫ్ 2.. అధీరా ఫస్టు లుక్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 July 2020 6:18 AM GMT
కేజీఎఫ్ 2.. అధీరా ఫస్టు లుక్‌

సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో 'కేజీఎఫ్‌2' ఒకటి. కన్నడ నాట విడుదలై దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన చిత్రం 'కేజీఎఫ్'‌. ప్రశాంత్‌ నీల్‌ దర్వకత్వంలో కన్నడ రాకింగ్‌ స్టార్‌ యష్‌ హీరోగా నటించిన ఈ పీరియాడికల్‌ ఎంటర్‌టైనర్‌ అన్నిబాషల ప్రేక్షకులకు ఆకట్టుకుని బాక్సాఫీస్‌ వద్ద అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రం 'కేజీఎఫ్‌ 2'.

ఈ మ‌ధ్య కాలంలో ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి రేపిన అంశం.. అధీరా లుక్‌. అధీరా పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్ న‌టిస్తున్నారు. బుధ‌వారం సంజ‌య్ ద‌త్ పుట్టిన‌రోజు (జూలై 29)కావడంతో చిత్ర యూనిట్‌ ఈ సందర్భంగా అధీరా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసింది. ఈ భూమిపై క్రూరత్వానికి పరాకాష్ఠ అని ఎవరినైనా అంటే అది అధీరా మాత్రమే అంటున్నాడు దర్శకుడు ప్రశాంత్‌నీల్. విలన్ పాత్ర కోసం వెతుకుతున్న సమయంలో మొదట గుర్తుకు వచ్చింది సంజయ్ దత్ మాత్రమే అంటున్నాడు. కరోనావైరస్ సంక్షోభం వల్ల చిత్రీకరణ కొన్ని నెలలు వాయిదా పడినా.. అక్టోబర్ లో విడుదల చేయాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ ఫస్టు లుక్‌లో అధీరా.. తెల్ల‌టి గ‌డ్డం, మెలితిప్పిన మీసాలు, డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్‌, డ్రెసింగ్, ముఖంపై ప‌చ్చ‌బొట్టు, చేతిలో ప‌దునైన పెద్ద క‌త్తి ప‌ట్టుకుని ఏదో సుధీర్ఘ‌మైన ఆలోచ‌న‌లో ఉన్నాడు. ఈ లుక్‌ను విడుద‌ల చేసిన త‌ర్వాత ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ ‘అధీరా’వైకింగ్స్ యొక్క క్రూరమైన మార్గాల నుండి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాం. 'కేజీఎఫ్ చాప్టర్ 2'లో భాగమైనందుకు మీకు ధన్యవాదాలు. హ్యాపీ బర్త్ డే సంజయ్ బాబా. త్వరలో స్టార్ట్ అవబోయే మన క్రేజీ షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్నాము అని ట్వీట్ చేసారు. ఈ చిత్రాన్ని తెలుగులో వారాహి చ‌ల‌న చిత్రం విడుద‌ల చేస్తుంది. ఈ చిత్రానికి ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.Next Story