టాలీవుడ్‌లో కిక్‌, రేసుగుర్రం, ఊసరవెల్లి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ నటుడు శ్యామ్‌. తెలుగుతో పాటు తమిళం, కన్నడ సినిమాల్లో నటించాడు. కాగా.. శ్యామ్‌ని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలోని కోడంబాక్కంలో పోకర్‌ క్లబ్‌ ను నడుపుతున్నట్లు గుర్తించిన పోలీసులు అతడి క్లబ్‌పై దాడి చేసి శ్యామ్‌ని అదుపులోకి తీసుకున్నారు. శ్యామ్‌ అరెస్ట్‌ కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. ఎటువంటి అనుమతులు లేకుండా పేకాట, బెట్టింగులు నిర్వ‌హిస్తుండ‌టంతో శ్యామ్‌ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

శ్యామ్ తో పాటు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. కాగా, నుంగంబాక్కంలో నివసించే శ్యామ్, కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తన నివాసంలోనూ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. శ్యామ్ తెలుగులో న‌టించిన `కిక్‌` చిత్రం మంచి విజ‌యాన్ని సాధించింది. అప్పటి నుంచి అందరూ అత‌న్ని అంతా `కిక్` శ్యామ్‌గా పిల‌వ‌డం మొద‌లుపెట్టారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *